భూములు లాక్కొని రోడ్డున పడేశారు

వైయస్‌ జగన్‌ను కలిసిన మడ్డువలస ప్రాజెక్టు భూ నిర్వాసితులు
న్యాయం చేయాలని వినతిపత్రం అందజేత
శ్రీకాకుళం: భూములు లాక్కుని పరిహారం ఇవ్వకుండా తెలుగుదేశం ప్రభుత్వం వేధిస్తోందని మడ్డువలస ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మడ్డువలస భూ నిర్వాసితులు వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. భూములు లాక్కొని ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని, ప్రభుత్వ చర్యతో రోడ్డున పడ్డామని వాపోయారు. పరిహారం అందించేలా కృషి చేయాలని, తమ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని రైతులు వినతిపత్రం అందజేశారు. పరిహారం అందించే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తానని వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 
తాగునీటి సౌకర్యం లేదు..
తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామస్తులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు, తాగునీటి సౌకర్యం లేదని చెప్పారు. రెడ్డి కులస్తులు అన్ని రకాలుగా వెనుకబడ్డారని ఆవేదన చెందారు.  

Back to Top