జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

విశాఖః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ కలిసి జర్నలిస్టుల సమస్యలు వివరించారు. పదవి విరమణ చేసిన జర్నలిస్టులకు రూ.10 వేలు పెన్షన్‌ ఇవ్వాలని విన్నవించారు. జర్నలిస్టు మరణిస్తే భార్యకు రూ.5వేలు పెన్షన్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరులు కల్పించాలని జర్నలిస్టు సంఘ ప్రతినిధులు కోరారు. జిల్లాలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యలపై జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరుల కల్పి స్తామని జగన్‌ హామీ ఇచ్చారు. పెన్షన్‌పై పూర్తి అధ్యయనం తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు
Back to Top