వైయస్‌ జగన్‌ను కలిసిన త్రిపుల్‌ ఐటీ విద్యార్థులుకృష్ణా జిల్లా: త్రిపుల్‌ ఐటీ విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.32 వేలు మాత్రమే ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. త్రిఫుల్‌ ఐటీ పూర్తి కాగానే వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జాబు ఇచ్చే వారని గుర్తు చేశారు. పిల్లలను చదివించడం కష్టమైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. త్రిపుల్‌ఐటీలో సీట్లు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు.  వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
 
Back to Top