<br/><strong>వైయస్ జగన్‌కు కౌలురైతు మొర...</strong><br/><strong>శ్రీకాకుళంః</strong> హుదూద్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయామని ఇప్పటికి పరిహారం అందలేదని జి.సిగడాం మండలం పాలఖండ్యాంకు చెందిన కౌలు రైతు రమణరావు ఆవేదన వ్యక్తం చేశారు. జననేత వైయస్ జగన్‌కు కలిసి తమ గోడు వినిపించారు. హుద్‌హుద్ తుఫాన్‌లో నాలుగు ఎకరాల వరి పూర్తిగా దెబ్బతిందని, పరిహారం కోసం అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. పోలంలో విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, అయినా రెండేళ్లు విద్యుత్ బిల్లులు కట్టానన్నారు.నేటికి విద్యుత్ స్తంబాల పునరుద్ధరణ జరగలేదన్నారు. వైయస్‌ఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని చంద్రబాబు సర్కార్ అటకెక్కించిందన్నారు.