అన్యాయంగా తొలగించారన్నా..

ఫీల్డ్‌ అసిస్టెంట్లపై టీడీపీ రాజకీయ వివక్ష...
న్యాయం చేయాలని వైయస్‌ జగన్‌కు వినతి..
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను ఉపాధి హామీఫీల్డ్‌ అసిస్టెంట్లు కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా 400 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించారని వాపోయారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులు అనే వివక్షతో టీడీపీ ప్రభుత్వం ఫీల్‌ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో జీతాలు సక్రమంగా వచ్చేవని, నేడు టార్గెట్‌లు విధించి కేవలం ఇంటెవ్స్‌ రూపంలోనే జీతాలు చెల్లిస్తున్నారన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Back to Top