తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు మంగళవారం విరామం ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ బంద్ చేపడుతున్న దృష్ట్యా అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొనేందుకు వైయస్ జగన్ పాదయాత్ర ఒక్క రోజు నిలిపివేశారు. తూర్పు గోదావరి జిల్లాలో బస చేస్తున్న ప్రతిపక్ష నేత క్యాంపు నుంచే బంద్‌ను పర్యవేక్షిస్తున్నారు. తిరిగి బుధవారం ఉదయం నుంచి పాదయాత్ర యథావిథిగా ప్రారంభమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ వెల్లడించారు.