<br/>విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆర్ట్ క్రాప్ట్ టీచర్లు వైయస్ జగన్‌ను కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ మేరకు ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మేలు చేస్తామని మాట ఇచ్చారు.