జగం మెచ్చిన యాత్ర..  జగన్‌ సంకల్ప యాత్ర

మహానేత వారసుడిగా వచ్చి.. జననేతగా ఎదిగిన వైయస్‌ జగన్‌మోహనుడు కడప జిల్లా ఇడుపులపాయలో నవంబర్‌ 6, 2017న ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర జనవరి 9, 2019న ఇచ్ఛాపురంలో ముగిసింది. లక్షల మంది అభిమానులు ప్రత్యక్షంగా వేల మైళ్ల దూరం ప్రయాణించి ఇచ్ఛాపురం చేరుకున్నారు. గుండెల నిండా అభిమానం నింపుకుని జననేత విజయయాత్రకు సంఘీభావం ప్రకటించారు. 13 జిల్లాల్లో మూడు క్యాలెండర్‌ సంవ్సరాల్లో 341 రోజులు జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో జననేతకు అడుగడుగునా ప్రజలు విజయ హారతులు పట్టారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు తేడా లేకుండా 3648 కిలో మీటర్లలో అడుగడుగునా జగన్‌మోహనుడికి జత కలిశారు. నాలుగేళ్ల చంద్రబాబు అరాచక పాలనలో తాము పడుతున్న కష్టనష్టాలను వివరించడానికి ఆయన వస్తున్న చోటికి తరలివచ్చారు. కష్టాలు తీర్చడానికి మన జిల్లాకే వస్తున్న రాజన్న బిడ్డ కోసం ఎదురుచూసిన లక్షల మంది ఆపన్నులు ఆశగా ఎదురొచ్చారు. 

 

వైఎస్సార్‌సీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోనే కాదు.. బోనీ కొట్టని పశ్చిమగోదావరి జిల్లాలోనూ మహా పాదయాత్రికుడికి జనం జేజేలు పలికారు. నియంత పాలనపై సమర శంఖం పూరించిన రాజన్న బిడ్డకు అండగా ఉంటామని పాదయాత్రలో కలిసి నడిచి మద్దతు ప్రకటించారు. పార్టీకి బలం లేదన్న ఉత్తరాంధ్రలో వచ్చిన స్పందనతో ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత ప్రపంచానికి తెలిసింది. నీతి పరుడినని చెప్పుకుంటూ రాజధాని ముసుగులో భూ సంతర్పణ, అభివృద్ధి, ఉద్యోగాల పేరు చెప్పి విదేశీ పర్యటనలు, దావోస్‌ టిక్కెట్ల కొనుగోళ్లు.., కులాల పేరు చెప్పి వెనుకబాటుకు గురిచేయడం.., అనుభవం పేరు చెప్పి అసెంబ్లీ నిర్మాణంలో దోపిడీ.., ఆంధ్రుల జీవనాడి పోలవరంలో అక్రమాలు, ప్రత్యేక హోదా పేరెత్తితో అణచివేతలు, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక హోదాపై మాట మార్చడం., ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అసవసరాల కోసం పొత్తులు పెట్టుకోవడం.. ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చేస్తున్న మోసంపై పెద్ద ఎత్తున  ఉద్యమాలు చేపట్టిన ఘనత వైయస్‌ జగన్‌ది. అసెంబ్లీని వదిలి ప్రజా క్షేత్రంలోకి అడుగిడిన జననేత.. అంతం చేసే కుట్రలను ఛేదించి అంతిమ పోరాటానికి సిద్దమయ్యాడు. 

 

తల్లితో కలిసి రాజన్న ఆశయాలతో వైయస్‌ జగన్‌ మొదలు పెట్టిన పార్టీ అన్ని ప్రధాన ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తృటిలో అధికారం చేజార్చుకున్నా.. అడుగడుగునా ప్రజల పక్షానే నిలిచాడే తప్ప ఏనాడూ పోరాటానికి వెరవలేదు. వైయస్‌ఆర్‌ మరణానంతరం నల్లకాలువ సభలో ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ పార్టీని, పదవులను కాలదన్ని ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా.. బాధ్యతలు భుజాన వేసుకుని సాగుతున్న శ్రామికుడు వైయస్‌ జగన్‌. యువత ఉద్యోగాల కోసం, పేదింటి బిడ్డల ఉచిత ఉన్నత చదువుల కోసం, రైతులకు గిట్టుబాటు ధర కోసం, అణ గారిన కులాల అభ్యున్నతి కోసం, కార్మిక సమస్యల పరిష్కారం కోసం... ఇలా అన్ని వర్గాల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కోటి గొంతుకల ఆవేదనను విన్న జననేత పరిష్కారం కోసం కంకణం కట్టుకున్నాడు. కోట్లాది ప్రజల ఆశల సౌధం ఆ యో«ధుడికి సంకల్పం సిద్దించాలని కోరుకుందాం... 

Back to Top