నరసన్నపేట: ప్రజా సమస్యలే అజెండాగా ప్రభుత్వాన్ని వైయస్సార్‌సీపీ నిలదీస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు అన్నారు. స్థానిక మేజరు పంచాయతీ పరిధిలో నేతాజీవీధి, స్టేట్ బ్యాంక్, నాయుడువీధుల్లో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ... చంద్రబాబు అడ్డదారుల్లో పాలన చేస్తు ప్రజలను వంచిస్తున్నారని ధ్వజమెత్తారు.
ముదినేపల్లి రూరల్: అసమర్థ పాలనతో అగచాట్లు పడుతున్నాం. సంక్షేమ ఫలాలు ఏ ఒక్కటీ మా దరికి చేరడం లేదు. తాగేందుకు గుక్కెడు నీరు లేదు. సాగునీరు లేక సార్వాసాగు సజావుగా సాగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా బతుకులు వెళ్లదీయాలి? ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని మండల పరిధిలోని పెయ్యేరు గ్రామస్తులు వాపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ప్రభుత్వం చేతగానితనం వల్ల రెండేళ్లుగా నియోజకవర్గంలోని పంట భూములకు సాగు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.
మోసకారికి బుద్ధి చెబుతాం
విశాఖ ఈస్ట్: మాయమాటలు చెప్పి బాబు అధికారంలోకి వచ్చారు. మరోసారి బాబు మాటలు నమ్మేది లేదు. ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ సారి తగిన బుద్ధి చెబుతాం. అని రెండో వార్డు పరిధి శ్రీరాంనగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు అరాచకాలను ప్రజలకు వివరించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గం లో " గడప గడపకు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ " కార్యక్రమం నర్సీపట్నం మున్సిపాలిటీ , పెదబొడ్డేపల్లి 11 వ వార్డ్ లో నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ కర్త శ్రీ పెట్ల ఉమా శంకర్ ఆధ్వర్యంలో సాగింది.