ఉత్సాహంగా వైయస్ఆర్ కుటుంబం

శావల్యాపురంః వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమంలో బూత్‌ కమిటీ సభ్యులు కీలకపాత్ర వహించాలని వినుకొండ నియోజకవర్గ వైయస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ బొల్లా బ్రహ్మనాయుడు పిలుపు నిచ్చారు.సోమవారం మండలంలోని ముండ్రువారిపాలెం గ్రామంలో వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి అప్యాయంగా పలకరించి ప్రజల సాధక బాధలు అడిగి తెలుసుకుంటున్నారు. వైయస్‌ హయాంలో ప్రజాసంక్షేమ పథకాలు అమలు తీరు ఆరా తీశారు. అలాగే టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల అమలు ఏవిధంగా ఉందని ప్రశ్నించగా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ అర్హులకు సంక్షేమ పథకాలు అందకపోగా కేవలం పచ్చ చొక్కా వారికే పథకాలు మంజూరు చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రజలు బాధలు తెలుసుకున్న బొల్లా మాట్లాడుతూ... టీడీపీ ఆరాచక పాలనకు ప్రజలు త్వరలో తగిన బుద్ది చెబుతారన్నారు.ఇలాంటి పాలన గతంలో ఎన్నుడు చూడలేదని కేవలం ప్రజాసంక్షేమ పథకాలు ఏకపక్షంగా ఇవ్వటం దారుణంమన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైయస్సార్‌ సీపీకు అండగా ఉండి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలన్నారు.అనంతరం ఇంటింటి తిరిగి నవరత్నాలు గురించి వివరించి కరపత్రాలు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్‌ చుండూరి వెంకటేశ్వర్లు,చింతా పేరయ్య,స్వర్ణాల వెంకటరావు,పాపసాని వెంకటేశ్వర్లు,గోవిందరాజులు,విప్పర్ల సుబ్బయ్య,పురేటి రాంబాబు,కోతి నాగేష్‌ కార్యకర్తలు అబిమానులు పాల్గొన్నారు.

Back to Top