రానున్నది రాజన్న రాజ్యమే

బడుగలకు భరోసా..నవరత్నాలు
ఇచ్ఛాపురం రూరల్ః బడుగు బలహీన వర్గాలకు భరోసా కల్పించేందుకే వైయస్‌.జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకమని వైయస్సార్సీపీ  రైతు సంఘ కన్వీనర్‌ తిప్పన కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హరిపురం పంచాయతీలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 23 కుటుంబాలను వైయస్ఆర్ కుటుంబంలో చేర్పించారు. కార్యక్రమంలో బూత్‌ కన్వీనర్‌ తలగాన మోహనరావు, వడ్డిన మురళీ, దుర్గాశి సత్యన్నరాయణ, వడ్డిన యోగి, వడ్డిన దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.
.................................................
నవరత్నాలతో నూతన శకం
జియ్యమ్మవలస: వైయస్ఆర్ కుటుంబంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఈ మేరకు అందరూ వైయస్సార్‌ కుటుంబంలో చేరి, నవరత్నాల పథకంతో లబ్ధి పొందాలని వైయస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ మూడడ్ల గౌరీశంకరరావు తెలిపారు. మంగళవారం మండలంలోని పెదకుదమ పంచాయతీలోని పెదకుదమ, చినకుదమ గ్రామాల్లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ బూత్‌ కమిటీ సభ్యులు ఇంటింటా ప్రచారం చేసి నవరత్నాల పథకం గురించి వివరించారు. కార్యక్రమంలో మరడాన ధనుంజయనాయుడు, మరడాన కిశోర్, టొంప లక్ష్మణయాదవ్, పెంట త్రినాథనాయుడు, రాయగడ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
...........................................
గిరిజన గ్రామాలను పార్వతీపురం ఐటీడీఏలో కలుపుతాం
శృంగవరపుకోట రూరల్ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్‌.కోట నియోజకవర్గ పరిధిలో గల పలు గిరిజన గ్రామాలను ఐటీడీఏలో కలుపుతామని వైయస్‌ఆర్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ నెక్కల నాయుడుబాబు ప్రకటించారు. సోమవారం రాత్రి మండలంలోని అమ్మపాలెం గిరిజన గ్రామంలో వైయస్‌ఆర్‌ సీపీ గిరిజన నేత కేత వీరన్న ఆధ్వర్యంలో ‘వైయస్‌ఆర్‌ కుటుంబ కార్యక్రమం’ నిర్వహించారు. ఈ సందర్భంగా నెక్కల నాయుడుబాబు గిరిజన యువతనుద్ధేశించి మాట్లాడుతూ.... పార్వతీపురం, పాడేరు ఐటీడీఏల్లో ఉన్న గిరిజన గ్రామాల యువతకు ఉద్యోగావకాశాలు దక్కుతున్నప్పటికీ మైదాన మండలాల్లోని గిరిశిఖర గ్రామాల గిరిజనులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించకపోవటం టీడీపీ ప్రభుత్వ తప్పిదమన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు టీడీపీ అనేక హామీలు గుప్పించి వాటిని నెరవేర్చలేదని మండిపడ్డారు. మరలా ఎన్నికలు సమీపిస్తున్నందున మీ ముందుకు ఓట్లను అభ్యర్థించేందుకు వచ్చే తెలుగుదేశం పార్టీ నేతలను నిలదీయాలని సూచించారు. ఇక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం యువనేత వైయస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటించిన విధంగా ‘నవరత్నాలు’ అనే తొమ్మిది పథకాలను అమలు చేయటం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మేలు చేకూరుతుందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. 
..................................................
నవరత్నాలతో పేదల అభ్యున్నతి
వంగర: వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకంతో పేదల అభ్యున్నతి జరుగుతుందని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. మంగళవారం మండల పరిధి అరసాడలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. గ్రామంలో ఇంటింటా పర్యటించి వైయస్సార్‌ కుటుంబంలో పలు కుటుంబాలను చేర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... ప్రజా సంక్షేమానికి టీడీపీ తూట్లు పొడుస్తుందని అన్నారు. పచ్చచొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందువల్ల అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. వైయస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ మాట్లాడుతూ.... సంక్షేమ పథకాలు పేరిట టీడీపీ దోపిడీ విధానాన్ని అవలంభిస్తున్నారని తెలిపారు. నీరు–చెట్టు పథకం పేరుతో దోపిడీకి పాల్పడ్డారని, పచ్చచొక్కాల వారికే పథకాలు కట్టబెట్టి నిరుపేదల నోట్లో టీడీపీ ప్రభుత్వం మట్టికొట్టిందన్నారు. భవిష్యత్‌ వైయస్సార్‌ సీపీదేనన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అంతా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, కిమిడి ఉమామహేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు మజ్జి వెంకటనాయుడు, మండల నేతలు ఉదయాన మురళీకృష్ణ, తెంటు జోగినాయుడు, జరజాపు అప్పలస్వామి, పున్నాన సత్యంనాయుడు, లచ్చుభుక్త సత్యన్నారాయణ, రాగోలు రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.............................................
నవరత్నాలతో అన్ని వర్గాలకూ మేలు
నరసన్నపేట: వైయస్సార్‌ సీపీ అధినేత జగన్‌ ప్రకటించిన నవరత్నాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మండలం కంబకాయలో మంగళవారం పార్టీ బూత్‌ కమిటీ కన్వీనర్లు పాగోటి ప్రభాకరరావు, బైరి కాళిదాసు అధ్వ ర్యంరలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం 11వ తేదీతో ముగుస్తుందని ఈలోగా కార్యకర్తలు, పార్టీ అభిమానుల కుటుంబాలను పార్టీలో చేర్చాలన్నారు. నవరత్నాలకు ఆదరణ బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చింతు రామారావు, ఆరంగి మురళి, సురంగి నర్శింగరావు, బగ్గు రమణయ్య, రాజాపు అప్పన్న, అల్లు అప్పలనాయుడు, పాగోటి శ్రీరాములు, కుంచి లక్ష్మణరావు, పాగోటి సూర్యనారాయణ, పాగోటి రామారావు, వెలమల శ్రీనివాసారావు పాల్గొన్నారు. మేజరు పంచాయతీ నరసన్నపేటలో హనుమాన్‌ నగర్‌, పచూరి కాలనీల్లో చింతు రామారావు ఆధ్వర్యంలో వైయస్సార్‌కుటుంబం కార్యక్రమం జరిగింది.
........................................
రానున్నది రాజన్నరాజ్యమే
సీతంపేట: రానున్నది రాజన్న రాజ్యమేనని వైయస్సార్‌సీపీ యూత్‌కన్వినర్లు హిమరక మోహన్‌రావు, ఎస్‌.మహేష్‌లు ఆన్నారు. పొట్టిజొన్నడుగూడ,గుడ్డిమీదగూడ, పొట్టి బెన్నడుగూడ తదితర గ్రామాల్లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతీ ఇంటికీ వెళ్లి వైయస్ పాలనలో జరిగిన సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్దిపొందిన లబ్దిని అడిగి తెలుసుకున్నారు. 9121091201 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇప్పించి పలువురుని వైయస్సార్‌ కుటుంభంలో చేర్పించారు. నవరత్నాల గూర్చి వివరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఎస్‌.రమేష్, నాగరాజు, గణేష్, రంగారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top