<strong>బాబును నమ్మేది లేదు</strong>పి.గన్నవరం: చంద్రబాబును నమ్మేదీ లేదన్న విషయం తమకు స్పష్టంగా అర్థమయిందని అయినవిల్లి మండల పరిధిలోని శానపల్లిలంక గ్రామస్తులు అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్‌సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు స్థానికంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందజేసి చంద్రబాబు మోసపూరిత పాలనపై మార్కులు వేయించారు. <br/><strong>ఉపాధి కరువు</strong>ముమ్మిడివరం: నగర పంచాయతీలో విలీనమైన తరువాత మాగ్రామంలో ఉపాధి హామీ పథకం రద్దు చేసి ఉపాధిలేకుండా చేశారని సోమిదేవరపాలెం ఉపాధి కూలీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఎదుట వాపోయారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక నగర పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబుది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. ప్రజలను కంటికిరెప్పల చూసేకోవాల్సిన ముఖ్యమంత్రి వారి ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. <img src="/filemanager/php/../files/Viswa/untitled%20folder/gadapa2/unnamed.jpg" style="width:716px;height:538px"/><br/>