బాబు దిగిపోతేనే రాష్ట్రం బాగుపడుతుంది

కర్నూలు(ఆలూరు))కరువు ఎప్పుడూ బాబు వెంటే ఉంటుందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాడంటే రాష్ట్రం కరువు బారిన పడటం తప్పదని చిప్పగిరి మండలం, నంచర్ల గ్రామస్తులు అన్నారు. బాబు దిగిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం వద్ద అన్నారు. గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా నంచర్ల, బంటనహల్ తదితర గ్రామాల్లో పర్యటించారు. బాబు వైఫల్యాలను ఎండగట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Back to Top