బాబును ఈస‌డించుకుంటున్న ప్ర‌జ‌లు

ప్ర‌కాశంః చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌లంతా ఈస‌డించుకుంటున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా కొండేపి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త వ‌రికూటి అశోక్‌బాబు విమ‌ర్శించారు.  నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పొన్న‌లూరు మండ‌లం కె.అగ్ర‌హారం గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికి తిరుగుతూ.. చంద్ర‌బాబు అవినీతి ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. రైతులు మొద‌లు చిన్న పిల్ల‌ల వ‌ర‌కు అంద‌రినీ టీడీపీ స‌ర్కార్ మోసం చేసింద‌ని మండిప‌డ్డారు. అనంత‌రం ప్ర‌జాబ్యాలెట్‌ను స్థానికులకు అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 


Back to Top