ఒక్క ఇళ్లు కూడ మంజూరు కాలేదు

నెల్లూరుః నగరంలోని 9వ డివిజన్ లో కార్పొరేటర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఒక్క ఇళ్లు కూడ మంజూరు చేయలేదని మండిపడ్డారు. నగరంలో ఏప్రాంతానికి వెళ్లినా బాడుగలు కట్టలేక పోతున్నామని, ప్రభుత్వం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్ ను కూడ కలవడం జరిగిందని చెప్పారు. అయినా అధికారుల్లో, పాలకుల్లో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే టీడీపీకి తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే హెచ్చరించారు.


తాజా ఫోటోలు

Back to Top