ప్రజల సంక్షేమం కోసమే నవరత్నాలు

పుల్లంపేట: ప్రజా సంక్షేమం కోసమే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టారని,  గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నామని ఇంఛార్జ్‌ ముద్దా బాబుల్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం నెరవేరని హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కహామీ నెరవేర్చడంలేదని ప్రజలు వైయస్సార్‌ కుటుంబంలో భాగంగా తెలిపారు. నిరుద్యోగభృతి, ఇంటికో ఉద్యోగం, రైతురుణ మాఫీ అంటూ ఏ ఒక్కహామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. అనంతయ్యగారిపల్లె, కోనయ్యగారిపల్లె గ్రామాల్లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఏ ఇంటికి వెళ్లినా విశేష స్పందన లభిస్తోందని, రాజన్నరాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వారు ప్రజలను కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే బడుగు, బలహీన, పేద, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రామనాథం, కుమార్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
...........................................................
జమ్మలమడుగు: నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నవరత్నాలు కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరిని వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యులుగా చేర్పించాలని సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆర్‌అండ్‌బీ అతిథి గృహాంలో మున్సిపాలిటి 20 వార్డులకు చెందిన కార్యకర్తలతో వైయస్‌ఆర్ కుటుంబం కార్యక్రమంపై చర్చించి వారికి ప్రచార సామాగ్రి కిట్లను పంపిణి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నియోజకవర్గంలో కుటుంబ పాలన అంతం చేయడంకోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే వైయస్సార్‌కుటుంబం కార్యాక్రమంలో ఎర్రగుంట్ల, ముద్దనూరు,కొండాపురం మండలాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం నుంచి జమ్మలమడుగు మున్సిపాలిటిలో, మిగిలిన రెండు మండాలలైనా మైలవరం, పెద్దముడియం మండలాల్లో కూడ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో వైయస్‌ఆర్‌ పార్టీకి బలం పెరిగిందన్నారు. మరింతగా పార్టీని ప్రజలకు చేరువకావడం కోసం అధినాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు మాజీ జడ్పీటీసీ అల్లె చిన్న చెన్నారెడ్డి, హనుమంతరెడ్డి, శివగుర్విరెడ్డి,పాలూరు నరసింహులు,పోచిరెడ్డి, గోపాల్‌రెడ్డి, గురుమూర్తి , మైనార్టీ నాయకులు మాబుసా, మున్నా, మాబు వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు
Back to Top