ఇంటింటికీ నవరత్నాలను తీసుకెళ్లాలి

బుచ్చినాయుడుకండ్రిగ; వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను మండలంలోని ఇంటింటీకి తీసుకెళ్లాలని ఆపార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. బుచ్చినాయుడుకండ్రిగలో బుధవారం ఇంటింటికీ నవరత్నాలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ....ప్రతి గడపను సందర్శించి, నవరత్నాల పత్రాన్ని, వంద ప్రశ్నలు ఉన్న పత్రాన్ని అందజేయాలన్నారు. సభ్యత్వ నమోదుతోపాటు ఇంటి తలుపుకు వైయస్‌ఆర్‌ కుటుంబం స్టిక్కర్‌ను, ఇంటి యాజమాని అనుమతితో అతికించాలని చెప్పారు. చంద్రబాబు పాలన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయలను తెలుసుకోవాలని తెలిపారు. మండలంలోని బూత్‌కమిటీలను సమన్వయం చేసుకుని, 20 రోజుల్లో ఇంటింటికీ వెళ్లాలన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరటానికి సభ్యత్వం తీసుకున్న వారి ఫోన్‌నుండి 912091210 నెంబరు మిస్‌కాల్‌ ఇవ్వాలని తెలిపారు. వైయస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వేంటనే అడిగిన వారందరికి పింఛన్ల్, పక్కాగృహాలు మంజూరుతోపాటు ఫీజురీయింబర్సుమెంట్, రైతన్నలకు ఉచితవిద్యుత్, 104, 108 సేవలకు, రోగులకోసం ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో రాజన్న పాలన జనరంజకంగా పాలించారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలంటే నవరత్నాల పత్రాలను ఇంటింటికీ చేర్చి అందరిన్ని వైయస్‌ఆర్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్చాలని తెలిపారు.∙ నవరత్నాలతో రాజన్న స్వర్ణయూగం రానుందని, నవరత్నాల గురించి ప్రజలకు అర్థమాయ్యోలా వివరించాలని చెప్పారు. ఉద్యమ స్పూర్తితో నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైయస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి అరణివిధ్యానాథరెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గోపియాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి గోపాల్‌రెడ్డి, నాయకులు గురునాథం, లక్ష్మీనారయణ, రాజయ్యనాయుడు, నాగూర్, బాబునాయుడు, రాజా, జయచంద్ర, సుదర్శనం, అమరలింగయ్య, వీరాస్వామిరెడ్డి, బాలశేఖర్, రజినీకాంత్, కేశవులు, తదితరులు పాల్గొన్నారు.



Back to Top