డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది
కర్నూలు(నంద్యాల): కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీంతో దోమల బెడద భరించలేకున్నామని నందమూరినగర్ వాసులు వైయస్సార్ సీపీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ రాజగోపాల్ రెడ్డి ఎదుట వాపోయారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందజేసి చంద్రబాబు పాలనపై ఆయన మార్కులు వేయించారు.
సమస్యలు పట్టించుకునే వారేరి
పత్తికొండ(మద్దికెర): గ్రామాల్లో నిత్యం సమస్యలు తాండివిస్తున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యారని పలువురు పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇంచార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి మండల పరిధిలోని హంప, బొమ్మనపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ తదితర పథకాలను లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో మోసగాడి పాలన
ఆళ్లగడ్డ(గంగవరం): ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలకు, బాబు చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతనలేదని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ రామలింగారెడ్డి ప్రశ్నించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన శిరివేళ్ల మండల పరిధిలోని గంగవరం గ్రామంలో ఆయన పర్యటించారు. అనంతరం వందప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్‌ను అందజేసి, బాబు పాలనపై మార్కులు వేయించారు. ఈసందర్భంగా ప్రతీ ఒక్కరూ మోసకారి పాలనపై ధ్వజమెత్తారు.