ప్రతి ఒక్కరిని వైయస్ఆర్ కుంటుంబంలో చేర్చాలి

అమలాపురం రూరల్‌: నవరత్నాల కరపత్రాలతో బూత్‌ కమిటీ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఒక్కరిని వైయస్సార్‌ కుటుంబంలో చేర్చాలని మండల వైయస్సార్‌ సీపీ అధ్యక్షుడు బొంతు గోవిందశెట్టి పిలుపునిచ్చారు. పేరూరు కొంకాపల్లిలో రూరల్‌ మండల కార్యదర్శి సూదా గణపతి, గ్రామ కమిటీ అధ్యక్షుడు చొల్లింగి సుబ్బిరామ్‌ ఆధ్వర్యంలో సోమవారం వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. బూత్‌ కమిటీ సభ్యులు 100 కుటుంబాలను వైయస్సార్‌ కుటుంబంలో చేర్చారు, మండల యువజన విభాగం అధ్యక్షుడు దొంగ శ్రీను, పార్టీ నాయకులు రంకిరెడ్డి సత్తిబాబు, కాసారి రామమకృష్ణ, ముత్యాల నాగమణి, కర్రి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top