నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు

చైతన్యనగర్‌లో వైయస్సార్‌ కుటుంబం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం):కొండపల్లి చైతన్యనగర్‌ లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం గ్రామ కన్వీనర్‌ అడపా వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా వైయస్సార్‌ సీపీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టనున్న నవరత్న పథకాల ప్రయోజనాలు గురించి ఇంటింటికి వివరించారు. ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికులతో వైయస్సార్‌ కుటుంబంలో చేరేలా ప్రోత్సహించారు. కార్యక్రమంలో బూత్‌కమిటీ చైర్మన్‌ జానీపాషా, మాజీ ఎంపీటీసీ సభ్యులు రామలింగేశ్వరరావు, నరశింహారావు, దాసు, బాషా పాల్గొన్నారు.
........................................
నవరత్నాలు – వైయస్సార్‌ కుటుంబాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి
చెరుకుపల్లిః  అభివృద్ధి పేరుతో అవినీతి ముసుగులో పచ్చజెండా నేతలు జేబులను నింపుకుంటున్నారే తప్పా..., ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీమంత్రి, వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం మండలంలోని వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో నవరత్నాలు – వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంపై వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో నవరత్నాలు, వైయస్సార్‌ కుటుంబం గురించి ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగడుతూ..., రాజన్న రాజ్యం గురించి ప్రజలకు అవగాహన చేయాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం యొక్క అవినీతి, అక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకుళ్ళి చైతన్యపరచాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. జగనన్న వస్తున్నాడు.. నవరత్నాలను తెస్తున్నాడని గ్రామాల్లోని ప్రజలకు తెలపుతూ... నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. అంతేకాకుండా మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీల్లో నవరత్నాలు – వైయస్సార్‌ కుటంబం కార్యక్రమం త్వరితగతిన బూత్‌ కమిటీ సభ్యులు పూర్తి చేయాలన్నారు. అదే విధంగా నవంబర్‌ 2వ తేదీన వైయస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టే పాదయాత్రలో దివంగత నేత వైయస్‌. రాజశేఖ రెడ్డి ప్రజా సమస్యలను ఏ విధంగా అడిగి తెలుసుకుని పరిష్కరించారో.. అదే విధంగా జగనన్న ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారన్నారు. జగనన్న పాదయాత్ర కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారన్నారు. 
........................
కారంపూడి తండాలో ‘వైయస్సార్‌ కుటుంబం’
కారంపూడి:కారంపూడి తండా బూత్‌ నంబరు 240లో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం శనివారం స్థానిక నాయకులు ఉత్సాహంగా నిర్వహించారు. బూత్‌ కన్వీనర్‌ ఆర్‌.కృష్ణానాయక్‌ సహచరులతో కలసి తండాలోని 40 ఇళ్లకు తిరిగి జగనన్న ప్రకటించిన నవరత్నాల పథకం గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్‌. హనుమంతునాయక్, ఎంపీటీసీ ఆర్‌.జ్యోతిబాయి, నాయకులు ఎస్‌కే షఫీ, మల్లేశ్వరరావు, బుజ్జి, ఎం.సీతానాయక్‌ మండల యువజన నాయకులు పాతూరి రామిరెడ్డి, ఆశం విజయభాస్కరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
...........................................
నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు
పెనుగంచిప్రోలు: జననేత వైయస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలతో అన్ని వర్గాలకు ఎంతో మేలు కలుగుతుందని ఆపార్టీ నాయకులు తెలిపారు. మండల కేంద్రం పెనుగంచిప్రోలు ఇందిరమ్మ మోడల్‌ కాలనీలో శనివారం ’ వైయస్సార్‌’ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వైయస్సార్‌సీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల సమయంలో చేసిన హామీలను నేటికీ నెరవేర్చలేదని ప్రజలకు గుర్తు చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షులు కాకాని హరి, బూత్‌ కన్వీనర్‌ కారెం ఆదయ్య, నాయకులు చుంచు బెనర్జీ, రంగిశెట్టి దుర్గాప్రసాద్, దేరంగుల శ్రీనివాసరావు, కొల్లా రఘురామయ్య, మల్నీడి బాబు, వై చిట్టిబాబు, కె శంకర్, షేక్‌ నూర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
========================
వేములపల్లి(ఘంటసాల) : నవ్యాంధ్రలోని ప్రజలందరికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడానికే వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రకటించారని వైయస్సార్‌సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వకర్త సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. మండలంలోని వేములపల్లి గ్రామంలో వైయస్సార్‌సీపీ కుటుంబం కార్యక్రమాన్ని మండలపార్టీ అధ్యక్షులు వేమూరి వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలను కలసి సీఏం చంద్రబాబు చేసిన మోసపూరిత వాగ్దానాలు, డ్వాక్రా, రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి చెల్లించడంలో వైఫల్యాలను వివరించారు. 
Back to Top