బాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న గడపగడపకూ

గడపగడపలో ముమ్మరంగా పర్యటిస్తున్న వైయస్సార్సీపీ శ్రేణులు
బాబుకు ఓట్లు వేసి మోసపోయామని ప్రజల ఆవేదన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్  కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. టీడీపీ పాలనలో దగాపడిన రాష్ట్ర ప్రజల కష్టాలు పంచుకుంటూ వైయస్సార్సీపీ శ్రేణులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతీ గడప తిరుగుతున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏగడపకు వెళ్లినా ఒక్కటే ఆవేదన. రుణాలు మాఫీ కాలేదు. ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగభృతి, పింఛన్లు ఏవీ ఇవ్వడం లేదని ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. బాబుకు ఓట్లు వేసి మోసపోయామని ప్రజలు వైయస్సార్సీపీ నేతల వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులు బాగుపడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది వైయస్సార్సీపీతోనే సాధ్యమని, వైయస్ జగన్ ను సీఎం చేసుకుంటామని తేల్చిచెబుతున్నారు. 


వైయస్సార్సీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి అనంతపురంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతీ గడపకు వెళ్లి బాబు మోసాలను ఎండగడుతున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడుపై  నిప్పులు చెరిగారు. అవినీతి సొమ్ము దాచుకునేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్లను టీడీపీ కార్యకర్తల్లా మార్చేస్తున్నారని చంద్రబాబుపై  మండిపడ్డారు. గడప గడపకూ వైయస్సార్ కార్యక్రమం చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోందని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.

గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇసకపాలెం గ్రామంలో పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఇంఛార్జ్ ముత్యాల శ్రీనివాస్  రామాయపాలెం గ్రామంలో గడపగడపలో పర్యటించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గోనెగండ్ల మండలంలోని బీసీ తదితర కాలనీల్లో ఇంటింటికి వెళ్లి బాబు మోసాలను ఎండగట్టారు. మరోవైపు, విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం కన్నీవర్ ప్రగడ నాగేశ్వరరావు రాంబిల్లి మండలం ములజంఫ గ్రామంలో గడపగడపలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేమున్నామంటూ వారిలో భరోసా కల్పించారు. 

Back to Top