ప‌రిపాల‌న‌ను గాలికొదిలేసిన చంద్ర‌బాబు

ప్ర‌కాశంః చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసి ప్ర‌చార ఆర్భాటాల‌కే ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఐ.వి.రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర ప్ర‌జ‌లంతా స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు మండ‌లం ముళ్ల‌పాడు గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో గ‌డ‌ప గ‌డ‌పకూ వైయస్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. చంద్ర‌బాబు అవినీతి ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. 


Back to Top