న‌వ‌ర‌త్నాలుతో అంద‌రికీ ల‌బ్ధి

రాయచోటిఅర్బన్ (క‌డ‌ప‌):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలాంటి ప‌థ‌కాల‌తో అంద‌రికీ ల‌బ్ధి  చేకూరుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్‌ ప్రధానకార్యదర్శి విజయభాస్కర్ అన్నారు. గురువారం పట్టణంలోని 3,4 వార్డులలో ఆయన పార్టీకార్యకర్తలు, నేతలతో కలసి వైయ‌స్ఆర్ కుటుంబం  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైయ‌స్ఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో అర్హులైన పేదలంతా ల‌బ్ధి పొందార‌న్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు ఖరీదైన వైద్యం చేయించుకుని ప్రాణాలు కాపాడుకోగలిగారంటూ చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైయ‌స్ఆర్ పథకాలన్నింటిని ఉద్దేశ్యపూర్వకంగా నిర్వీర్యపరుస్తున్నట్లు ఆరోపించారు. జరుగబోయే ఎన్నికలలో వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రామాంజులురెడ్డి, సురేష్‌ కుమార్‌రెడ్డి, సోనూ, రమణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------
న‌వ‌ర‌త్నాలతోనే రాజ‌న్న రాజ్యం
పుల్లంపేట (క‌డ‌ప‌):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలుతోనే రాజ‌న్న రాజ్యం సాధ్య‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ముద్దా బాబుల్‌రెడ్డి తెలిపారు. గురువారం రెడ్డిపల్లి, పుల్లంపేట, దళితవాడ గ్రామాల్లో వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాన్ని బూత్‌క‌న్వీన‌ర్ ర‌మ‌ణారెడ్డి , మహేశ్వర్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయితీల్లోని ప్రతిగ్రామంలోనూ ప్రతిఇంటికి తిరిగి నవరత్నాల గురించి వివరించారు. పార్టీసభ్యత్వం నమోదు చేయించారు. చంద్రబాబుపాలనలో సంక్షేమపథకాలు ప్రజలకు అందడంలేదని వారు ప్రజలకు వివరించారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top