హత్యయత్నంపై విచారణ పక్కదారి..చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలి..వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ
విజయవాడః విశేష ప్రజాదరణ పొందుతున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజా జీవితం నుంచి తొలగించడానికి టీడీపీ కుట్ర పన్నిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వైయస్ జగన్‌పై హత్యాయత్న ఘటన విచారణను పక్కదారి పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ఘటన జరిగిన గంట నుంచి చంద్రబాబబు,డీజీపీ, టీడీపీ మంత్రులు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నారు. వైయస్ జగన్‌పై బురదచల్లే చర్యలకు దిగారన్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌ఫోర్ట్ సిఎఫ్‌ఐ, రాష్ట్ర పోలీసులు ఎవరికివారే మాకు సంబంధంలేదంటూ తప్పించుకుంటున్నారన్నారు. సంఘటన ఏ చోట జరిగిన వాస్తవాలు వెలికితీసి నిందితుడ్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.ఘటన జరిగిన గంటలోపే డీజీపీ స్టేట్‌మెంట్లు,మంత్రుల ప్రెస్‌మీట్లు, నిందితుడు రాసిన ఉత్తరం అంటూ అవాస్తవాలను ప్రచారం చేశారన్నారు. వెకిలి చేష్టలతో సీఎం చంద్రబాబు స్టేట్‌మెంటు వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత పరిణామాలను పరిశీలిస్తే విచారణను పూర్తిగా పక్కదారి పట్టించడానికి టీడీపీ ప్రభత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నదని అర్థం అవుతోందని వెంకటరమణ ధ్వజమెత్తారు.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విచారణపై ఎలా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్‌కు జెడ్‌ప్లస్ భద్రత అవసరమని డిమాండ్ చేస్తున్నామన్నారు. జ్యూడీషియల్ విచారణ జరిపించడానికి ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. బాధ్యత గల ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం ప్రభుత్వం స్పందించి చంద్రబాబు,లోకేష్ అవినీతి అక్రమాలపై విచారణ చేయిస్తుందనే భయం,అభద్రతా భావమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక అసలు రహస్యమన్నారు.వైయస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ సామాన్య తెలుగుదేశం కార్యకర్త అని, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెటాడంటే ఆ వెనుక ఎవరో ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. విచారణ అంతా లోప భూయిష్టంగా ఉందన్నారు.

Attachments area