<strong>ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి</strong>న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. కిడ్నీ బాధితుల సమస్యలు, రామాయపట్నం పోర్టు నిర్మాణంపై పీఎంతో ఎంపీ చర్చించారు. ప్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కిడ్నీ బాధితులకు ప్రత్యేక సాయం ఇవ్వాలని కోరారు.