10న అనంత‌లో యువ‌భేరి

అనంతపురంః విభ‌జ‌న చ‌ట్టంలోని హ‌క్కుల‌ను సాధించుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో అనంత‌పురంలో ఈ నెల 10వ తేదీన యువ‌భేరీ నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ జిల్లా అధ్య‌క్షుడు శంక‌ర్‌నారాయ‌ణ తెలిపారు. అనంత‌లో మాజీ ఎంపీ అనంత వెంక‌ట రామిరెడ్డితో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... 10వ తేదీన న‌గ‌ర శివారులోని ఎంవైఆర్ ఫంక్ష‌న్‌లో హాల్‌లో నిర్వ‌హించ‌నున్న యువ‌భేరీకి వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల్గొంటార‌ని, విభ‌జ‌న హ‌క్కులు, ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రిస్తార‌ని వారు చెప్పారు. యువ‌భేరీని ప్ర‌తి ఒక్క‌రూ విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. స‌మావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం అర్బన్‌ సమన్వయకర్త నదీమ్‌ అహ్మద్, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకా ష్‌రెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి, కదిరి సమన్వయకర్త సిద్దారెడ్డి, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top