వైయస్ సంక్షేమ పథకాలు విస్మరించారు!

ఖమ్మం 20 నవంబర్ 2012: వైయస్ సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ విమర్శించారు. నిరుపేదల ముఖంపై చిరునవ్వు చూసేందుకు మహానేత రాజశేఖర్ రెడ్డి అహర్నిశలూ కృషి చేశారన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన భారీ బహిరంగ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో జలగం వెంకట్రావ్ వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  వైఎస్ స్ఫూర్తితోనే ఆయన ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. మహానేత స్ఫూర్తితో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న తాను జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు నిధులు తెచ్చాననీ, వైయస్ ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదనీ ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం జలగం వెంగళరావు తర్వాత ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైయస్‌దే నన్నారు. మాజీ సీఎం జలగం వెంగళరావు తర్వాత ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైయస్‌దే నన్నారు.
అందరి చూపూ, వైయస్ఆర్ సీపీవైపు...
ఖమ్మంజిల్లాలోని అన్ని పార్టీల నాయకుల చూపూ ఇప్పుడు వైయస్ఆర్ సీపీ వైపే ఉందని పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.  రాష్ట్రంలో ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వం లేదన్నారు. ప్రజలు ఓ వైపు ఇబ్బందులు పడు తుంటే పాలకులకు ఇవేమీ పట్టడం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం అధికార పార్టీతో కుమ్మక్కైందన్నారు.. జగన్ సీఎం అయితేనే పేదల కష్టాలు తీరుతాయన్నారు. జిల్లాలో మహానేత ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా అప్పుడే పూర్తవుతాయన్నారు. జిల్లా ప్రజలకు వైయస్ అంటే అమితమైన అభిమానమని, అందుకే 2009 ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమైనా ఐదు స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని చెప్పారు.
అదే నమ్మకంతో వైయస్‌కు నిజమైన వారసుడిగా జగన్‌ను భావించి ఖమ్మజిల్లాలో ఓదార్పుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. అలాగే విజయమ్మను అంతకుమించి ఆదరించారన్నారు. పార్టీని బలమైన శక్తిగా రూపొందించి రానున్న ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలూ కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువజన విభాగం మూడు జిల్లాల కన్వీనర్ సాధు రమేష్‌రెడ్డి మాట్లాడుతూ, జగన్ త్వరలోనే జైలు నుంచివిడుదల కావడం తథ్యమ్ననారు.. ఇప్పటికే జిల్లాలో బలమైన శక్తిగా ఉన్న వైఎస్సార్‌సీపీ జలగం వెంకట్రావ్ చేరికతో తిరుగులేని శక్తిగా మారుతుందన్నారు. బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎదురు లేని శక్తిగా ఎదిగిందని, దీంతో అన్ని స్థానాల్లోనూ జయ కేతనం ఎగుర వేస్తుందని అన్నారు.
రైతు విభాగం జిల్లా కన్వీనర్ మందడపు వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ నీలం తుపానుతో రైతులు ఇబ్బంది పడుతున్నా,  సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు చుట్టపు చూపుగా వచ్చిపోయారే తప్ప నష్ట పరిహారంపై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు.

Back to Top