క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణం

హైదరాబాద్ః రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ధీటుగా ఎదుర్కొంటుందని తెలంగాణ పార్టీ నేత శివకుమార్ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని చెప్పారు. పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాల్సి ఉందని, ప్రతిగ్రామంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసేవిధంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సాధ్యమైనంత వరకు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిందని శివకుమార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ గా నామకరణం చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని... నగర అభివృద్ధికి ఆమహానేత ఎంతగానో పాటుపడ్డారని శివకుమార్ పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top