మండలి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీదే విజయం

నెల్లూరు: శాసన మండలి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి,పెళ్లకూరు మండల పరిషత్‌ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  మంగళవారం చిల్లకూరు గ్రామంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎంపీటీసీలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. మండలంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పది మంది ఎంపీటీసీ సభ్యులంతా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలపరిచిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయ కుమార్‌ రెడ్డికి మద్దతుగా నెల్లూరులో జరుగుతున్న నామినేషన్‌ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని పది మంది ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ సభ్యులందరూ ఐక్యంగా ఉన్నారని తెలిపారు.  

Back to Top