బాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది


తూర్పు గోదావరి: చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 50 రోజులకు పైగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోందని, అడుగడుగునా జననేతకు ఘన స్వాగతం లభిస్తోందని ఆయన చెప్పారు.  వైయస్‌ జగన్‌ ప్రజలతో మమేకమవుతూ..వారి సమస్యలు తెలుసుకుంటున్నారని రాజా పేర్కొన్నారు.  చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని టీడీపీ నేతలు చెరువులు తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గోదావరి జిల్లాలను ఎంతగానే ప్రేమించేవారని, అదే స్థాయిలో వైయస్‌ జగన్‌కు జిల్లా ప్రజలు తోడుగా ఉంటున్నారని చెప్పారు. మహానేత కుటుంబంపై ఎంత  అభిమానం ఉందో ప్రజా సంకల్ప యాత్రలో కనిపించిందన్నారు.


 
Back to Top