టీడీపీ పాలనలో లోకేష్‌ ఒక్కరికే ఉద్యోగం వచ్చింది

విశాఖ: తెలుగు దేశం పార్టీ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని, నారా లోకేష్‌ ఒక్కరికే ఎమ్మెల్సీ, మంత్రి పదవి వచ్చిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా విమర్శించారు. ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి సాధన కోసం బుధవారం వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో విశాఖలోని జీవీఎంసీ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయిన సమయంలో ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తామని టీyî పీ, బీజేపీ వారి మేనిఫెస్టోలో హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఆ రెండు పార్టీలు S ప్రత్యేక హోదాను మరిచాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, చంద్రబాబు ముఖం చూసి పరిశ్రామిక వేత్తలు రారన్నారు. పెట్టుబడుల పేరుతో చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ విహార యాత్రలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి..తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కరే ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తామని రాజా హెచ్చరించారు. 
చంద్రబాబు ప్రభుత్వం తాటా తీస్తాం: సలాం బాబు 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకపోతే చంద్రబాబు ప్రభుత్వం తాటా తీస్తామని వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలాం బాబు హెచ్చరించారు. మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత మనకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. అధ్వాన్నంగా నిర్వహిస్తున్న ఏపీపీఎస్‌ఈపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేని విమర్శించారు. 
Back to Top