తూర్పుగోదావరి- పదవి కోసం ఎలాంటి కుట్రలైన పన్నే వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జమలమడక నాగమణి మండిపడ్డారు.పిల్ల నిచ్చిన మామనే వెన్నుపోటు పోడిచి పదవిని లాక్కున్నారని దుయ్యబట్టారు. పదవిని కాపాడుకోవడం కోసం చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్ పాదాల వద్ద పెట్టారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని వైయస్‌ఆర్‌సీపీ యువజన నేత జక్కంపూడి రాజా విమర్శించారు. తెలుగు ఆత్మాభిమానాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. .చంద్రబాబు తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.