ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌సీపీ గెలుపు తథ్యం

–ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వైయస్‌ వివేకానందరెడ్డి గెలుపు తధ్యమని ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ..అవినీతి అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్‌లా మారుస్తానని మాటలు చెప్పి ఇప్పుడు అవినీతిలో నంబర్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేసి శాసన మండలి ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్ని చేసినా వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి గెలుపును ఆపలేరని వారు హెచ్చరించారు.
Back to Top