ఎమ్మెల్యేలకు విప్ జారీ

హైదరాబాద్ః   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది.  

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సమయంలో, అంటే ఈనెల 29, 30 తేదీలలో తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని ఆదేశించింది. 

పార్టీ విప్, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్‌నాథ రెడ్డి ఈ విప్ జారీ చేశారు. ఆ రెండు రోజులలో అసెంబ్లీకి హాజరు కావడంతో పాటు.. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Back to Top