అగ్రిగోల్డ్ సంస్థ లీగల్ అడ్వైజర్‌నని నిరూపించగలవా..? తప్పుడు ఆరోపణలు చేస్తున్న మంత్రిపై పరువునష్టం దావా వేస్తానా ఆస్తులు తప్పుడువని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా మంత్రి ప్రత్తిపాటికి గౌతమ్‌రెడ్డి బహిరంగ సవాల్
విజయవాడ: అగ్రిగోల్డ్ సంస్థకు తాను లీగల్ అడ్వైజర్‌నంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిచ్చి పుల్లయ్యలా మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. ఏ కోర్టులోనైనా అగ్రిగోల్డ్ తరుపున హాజరైనట్టు నిరూపించగలరా అని ప్రత్తిపాటికి చాలెంజ్ విసిరారు. పిచ్చి ముదిరితే తలకు రోకలిబండ కట్టుకున్నట్లుగా ప్రత్తిపాటి వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌ల నుంచి అక్రమంగా భూములు కొనుగోలు చేసి తనపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంసజం అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ భూములు తాను కూడా కొనుగోలు చేసినట్లు టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న మంత్రిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి పుల్లారావు అక్రమ ఆస్తులపై ఆధారాలతో సహా చూపిస్తుంటే ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి తనపై ఆరోపణలకు దిగారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాట్లాడండి అనగానే ప్రెస్‌మీట్‌లు పెట్టి గుడ్డిగా మాట్లాడితే ఎలా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎవరిని పంపిస్తావో డిసైడ్ చేసుకో..

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై పరువునష్టం దావా వేసితీరుతానని వైయస్‌ఆర్ సీపీ నేత గౌతమ్‌రెడ్డి హెచ్చరించారు. న్యాయపోరాటం చేస్తానని, జీవితంలో ఎప్పుడు తప్పుడు ఆరోపణలు చేయకుండా బుద్ధి చెబుతానని దుయ్యబట్టారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గౌతమ్‌రెడ్డి స్పష్ట్రం చేశారు. మీడియా సమక్షంలో కూర్చుంటానని, చంద్రబాబు వస్తారో.. లేక మంత్రులను పంపిస్తారో ఎవరినైనా పంపించుకోండి అని సవాలు విసిరారు. రైతు వద్ద నుంచి న్యాయంగా, సక్రమమైన సంపాదనతో కొనుగోలు చేశానని చెప్పారు. గతంలో హైకోర్టు కూడా సీబీ సీఐడీతో ఎంక్వైరీ చేయిస్తే తన ఆస్తులు న్యాయపరమైనవేనని తేలిందని టీడీపీకి సూచించారు. అగ్రిగోల్డ్ సంస్థకు, డైరెక్టర్‌లతో గౌతమ్‌రెడ్డికి, అతని కుమారుడికి ఎలాంటి సంబంధాలు లేవని డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అక్రమండి అగ్రిగోల్డ్ డైరెక్టర్‌ల నుంచి తప్పుదోవన భూములు లాక్కొని తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

లోకేష్ కోసమే సమస్య పరిష్కరించకుండా కుట్రఅగ్రిగోల్డ్ స్కాంలో ఇరుక్కొని 14 లక్షల మంది బాధితులు అల్లాడుతుంటే వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని గౌతమ్‌రెడ్డి విమర్శించారు. ఆస్తులన్నీ ప్రభుత్వం తీసుకొని బాధితులకు డబ్బు చెల్లిస్తామనే ఒక్క మాట చెప్పలేకపోయారని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్ బాధితుల గోడు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌కు అగ్రిగోల్డ్ ఆస్తులు హాయ్‌ల్యాండ్, నందిగామ కీసర బ్రిడ్జీ దగ్గరున్న పాల ఫ్యాక్టరీలను కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అందుకోసమే సమస్యను పరిష్కరించకుండా చేతులు దులుపుకుంటుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల్లో తాను కూడా ఒకడినని, యూనియన్ నాయకులు, బాధితులు సమస్య పరిష్కారించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బాధితులకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా టీడీపీకి తన ఆస్తులపై అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని, క్లారిఫికేషన్ ఇస్తానన్నారు.