వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్ యూనియ‌న్ నాయ‌కుల అరెస్టువిశాఖ‌: ఆంధ్ర విశ్వ విద్యాల‌యం వ‌ద్ద శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయ‌కుల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా అరెస్టు చేసి హార్బ‌ర్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.  చంద్రబాబు నాయుడు ఆంద్ర విశ్వవిద్యాలయం లో తలపెట్టిన జ్ఞానభేరి కార్యక్రమాన్ని వ్య‌తిరేకిస్తూ  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ధ‌ర్నా చేప‌ట్టారు. దీంతో పోలీసులు స్టూడెంట్ యూనియ‌న్‌కు చెందిన 10మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి హార్బర్ పోలీసు స్టేషన్ కి తరలించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం లో విద్య వాతావరణాన్ని కలుషితం చేసే జ్ఞానభేరి కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ వైయ‌స్ఆర్‌ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యం లో నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయ‌కుల‌ను అరెస్టు చేయ‌డం అక్ర‌మ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ నగర అధ్యక్షులు డాక్టర్ మళ్ళా. విజయ్ ప్రసాద్ ఖండించారు. అరెస్టు అయిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్ యూనియ‌న్ విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ బీ కాంతా రావు, రాష్ట్ర కార్యదర్శి ఎం కళ్యాణ్, నాయ‌కులు జగదీష్, ప్రసాద్, జీవన్, జోజి, సాయి కృష్ణ, క్రాంతికిరన్, నవీన్, లీలకృష్ణ త‌దిత‌రులు ఉన్నారు.
Back to Top