<br/>వైయస్‌ఆర్ జిల్లా: ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరీ, చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 24న తలపెట్టిన ఏపీ బంద్‌ను విజయవంతం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సురేష్‌బాబు, అంజాద్‌బాషా పిలుపునిచ్చారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ..లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరీ దారుణంగా ఉందన్నారు. అవిశ్వాసం చర్చలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరును దుయ్యబట్టారు. పార్లమెంటులో ఆయా పార్టీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా, ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ముమ్మరం చేయడంలో భాగంగా మంగళవారం (ఈ నెల 24న) రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ బంద్ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.