ప్రత్యేక హోదా ఇచ్చేవారికే మా మద్దతు


విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వారికే వైయస్‌ఆర్‌సీపీ మద్దతిస్తుందని మా అధినేత వైయస్‌ జగన్‌ ఇదివరకే ప్రకటించారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బీజేపీతో నాలుగేళ్లు కలిసి ప్రయాణం చేసిన చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వైయస్‌ఆర్‌సీపీపై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వకుండా ఇన్నాళ్లు అడ్డుకున్నారని, ఇప్పుడు బీజేపీతో కుమ్ముక్కు అయ్యామని పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈ నెల 21 కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పారు. వైయస్‌ జగన్‌ను విమర్శిస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను తిట్టడానికే చంద్రబాబు టైం కేటాయిస్తున్నారని, ప్రజా సంక్షేమం పట్టడం లేదన్నారు. కేసుల నుంచి కాపాడుకుందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు లాగా లాలూచీ రాజకీయాలు చేయమని చెప్పారు. అసెంబ్లీలో నీ తాబేదారులతో పొగిడించుకొని నీచ రాజకీయాలు చేయకండి అని హితవు పలికారు. 
 ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు పాత పాట పాడారన్నారు. అసెంబ్లీ సమావేశాలు టీడీపీ సమావేశాల మాదిరిగా నిర్వహిస్తున్నారని, చంద్రబాబుకు వీరుడు, సూరుడు అని పొగడ్తలతో ముంచెతున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి ఎలా కాపాడాలో అలోచించడం లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్న 23 మందిపై అనర్హత వేటు వేయకుండా టీడీపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. రాష్ట్రాన్ని టీడీపీ నేతలు బ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఈ రోజు మాట్లాడుతూ..సాయిరెడ్డి ఢిల్లీలో మోడిని పొగిడారని అంటున్నారు. ‘అయ్యా ..చంద్రబాబు నాలుగేళ్లుగా మీరు మోడీతో కలిసి ప్రయాణం చేశారని, అ«ధికారాన్ని ఎంజాయ్‌ చేసి ఇప్పుడు మాపై విమర్శలా అని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ బీజేపీకి ఎందుకు దగ్గరవుతామని ప్రశ్నించారు. మేం ఎలా కుమ్మకు అవుతామని నిలదీశారు. మిత్రపక్షమైన మీరు బీజేçపీతో కుమ్మక్కై రాష్ట్రాన్ని మోసం చేసిదే చంద్రబాబే అన్నారు. అరుణ్‌జైట్లీ రెండేళ్ల క్రితం ఏదైతే స్టేట్‌మెంట్‌ ఇచ్చారో అదే మాటలు  ఇటీవల కూడా చెప్పారన్నారు. అప్పుడు స్వాగతించిన చంద్రబాబు  ఇప్పుడు మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని ప్లెట్‌ ఫిరాయించారన్నారు. 
Back to Top