వైయస్‌ జగన్‌ను టార్గెట్‌ చేశారు


హైదరాబాద్‌:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అంతమొందించేందుకు టీడీపీ టార్గెట్‌ చేసిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.   రాజకీయాల్లో వైయస్‌ జగన్‌ను ఉంచకూడదనే కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలవడాన్ని ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదన్నారు. ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారని..వైయస్‌ జగన్‌ను ఎదురు పోటు పొడవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని హేళన చేయాలని చూస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ జగన్‌ ప్రభంజనాన్ని ఆపలేమని బాబు బరితెగించారన్నారు. ఎలాగైనా ప్రతిపక్ష నేతను అడ్డుతొలగించుకోవాలనే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. 
 

తాజా వీడియోలు

Back to Top