చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని

ట్యాక్స్‌లతో ప్రజలను జలగల్లా పట్టిపీడిస్తున్నాడు
బాబు నోటిని కడిగేందుకు ఫినాయిల్‌ సరిపోదు కొత్త మందు కావాలి
పెద్దనోట్ల రద్దు తప్పు అని ఇప్పుడనడం విడ్డూరం
చంద్రబాబు, లోకేష్‌ ట్యాక్స్‌తో ప్రజలు దోచుకుంటున్నారు
వంట గ్యాస్‌ రూ. 100 సబ్సిడీ ఏమైంది బాబూ?
ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబుది ఎలాంటి పాత్ర
ఇంధన ధరలు తగ్గించకపోతే చంద్రబాబు బజారుకు ఈడుస్తాం
విజయవాడ: ట్యాక్స్‌ల రూపంలో ప్రజల నడ్డి విరిస్తూ వారి ఎముకలను కూడా వదిలిపెట్టకుండా పిప్పిచేసి పీల్చే పిశాచి, ఆంధ్రరాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. నోట్ల రద్దుపై చంద్రబాబు చేసిన ప్రకటన వింటే నవ్వాలో.. ఏడవాలో కూడా అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రజల చెవుల్లో చంద్రబాబు పెట్టే పువ్వుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందన్నారు. చంద్రబాబు నోరు అబద్ధాల కంపు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని, అది ఏ మందు పెట్టి కడితే శుభ్రం అవుతుందో తెలియడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్‌ ధరలపై చంద్రబాబు చేసిన ప్రకటనలపై సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే పూటకోమాట అబద్ధం అన్నారు. పెద్ద నోట్ల రద్దు తప్పు చర్య అని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నోట్లరద్దు సాంకేతిక కమిటీకి చైర్మన్‌గా ఉండి మోడీ ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలను మంత్రులుగా.. రాష్ట్ర కేబినెట్‌లో బీజేపీ ఎమ్మెల్యేలను పెట్టుకొని నాలుగేళ్లు కాపురం చేశారన్నారు. ఇప్పుడు పెద్దనోట్ల రద్దు తప్పు అనడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రజలు పాత్రికేయులు అందరూ ఆలోచించాలన్నారు. నోట్ల రద్దును వైయస్‌ఆర్‌ సీపీ ఖండించినప్పుడు  చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆర్థిక స్థితి కుదేలవుతుందని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. 
పూటకోమాట.. ప్రతీ మాట అబద్ధం.. నిన్న చేసిన ప్రకటన తప్పు సవరణ చెప్పకుండా.. నోట్లరద్దు మరుసటి రోజు పెద్ద నోట్ల రద్దు సలహా నేనే ఇచ్చానన్నారు. ఆ కమిటీకి చైర్మన్‌గా ఉన్నాడు. నాలుగు సంవత్సరాలు మోడీ ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలను మంత్రులుగా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే కేబినెట్‌లో పెట్టుకొని నాలుగేళ్లు పాలించారు. పెద్దనోట్ల రద్దును వైయస్‌ఆర్‌ సీపీ ఖండించిన సమయంలో చైర్మన్‌గా ఈ చర్య తప్పు అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. 

పెట్రోల్, డీజిల్‌పై చంద్రబాబు, లోకేష్‌ ట్యాక్స్‌ పేరుతో పేద, సామన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. డీజిల్‌ ధర వంద కాబోతుందని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని, ట్యాక్స్‌ల పేరుతో ప్రజలను పిప్పిచేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే రోజు పెట్రో ధర రూ. 73, డీజిల్‌ ధర రూ. 62.41 ఉంది. ప్రస్తుతం పెట్రోల్‌ ధర రూ. 85.26, డీజిల్‌ ధర రూ. 78.42 ఇది మీరు చేసిన పాపం కాదా చంద్రబాబూ అని నిలదీశారు. పాపాన్ని కేంద్రమీద నెట్టడం  కాకమ్మకథలు, దొంగ కబుర్లు చెప్పి కేంద్రంతో చంద్రబాబు సాగించే రహస్యపరమైన లాలూచీ ప్రజలందరికీ తెలుసన్నారు. 

ఒక డీజిల్‌ బ్యారల్‌ ధర డాలర్‌ ప్రకారం 2014లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ. 112 ఉన్నప్పుడు ఇప్పుడు 70 రూపాయలకు పడిపోయింది. కానీ క్రూడాయిల్‌ ధరలు చూపించి డీజిల్, పెట్రోల్‌కు ధరలు పెంచుతారన్నారు. ముడిచమురు ధరలు తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి ప్రజలను దోపిడీ దొంగలు దోచుకున్నట్లు జలగల్లా పట్టిపీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ దొంగలకు ఉన్న కనీస జాలీ కూడా తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌కు లేదని, ట్యాక్స్‌ల పేరుతో దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఒక లీటర్‌ పెట్రోల్‌ రూ. 32కు వస్తుంటే ఇందులో రూ. 19 కేంద్రం పన్ను. రూ. 32 రాష్ట్రం పన్ను ఇద్దరూ కలిపి రూ. 52, దీనికితోడు చంద్రబాబు, లోకేష్‌ ట్యాక్స్‌ల పేరుతో రూ.4 అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.  

ప్రతి రోజు ఆంధ్రరాష్ట్రంలో ఎన్ని లీటర్ల పెట్రోల్, డీజిల్‌ ఉపయోగిస్తున్నారు.. దాని నుంచి వస్తున్న ఆదాయం కంటే నాలుగు శాతం అధనంగా వసూలు చేస్తున్నాడు. ట్యాక్స్‌ల రూపంలో వసూలు చేసిన 4 శాతం డబ్బు ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌ ధరలతో ప్రతి ఒక్కరి జీవితాలు ఆధారపడ్డాయని గ్రహించి నడ్డివిరుస్తున్నారని ధ్వజమెత్తారు. లీటర్‌ మీద రూ. 4 అదనపు వసూలు లోకేష్‌ కోసం కూడగడుతున్నాడని ఆరోపించారు. కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ ఆంధ్రరాష్ట్ర ప్రజానీకం నడ్డివిరుస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్‌ అత్యధిక ధర ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని సుధాకర్‌బాబు చెప్పారు. ఏపీలో వ్యాట్‌ శాతం పెట్రోల్‌పై 39.40, డీజిల్‌పై 31.75 ఉంటే తెలంగాణలో పెట్రోల్‌పై 32.25, డీజిల్‌పై 27 శాతం, కర్ణాటకలో పెట్రోల్‌ 32 శాతం, డీజిల్‌ 22 శాతం ఉందన్నారు. అర్థశాస్త్ర పితామహుడినని తనను తాను పొగుడుకునే చంద్రబాబు దొంగ ఉపన్యాసాలు ఆపి ఇంధన ధరలను అదుపులోకి తీసుకురావాలన్నారు. 
 
చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గిస్తానన్నాడు. 12 సిలిండర్లు సంవత్సరానికి, ధరలు పెరిగితే సబ్సిడీతో రూ.100 తగ్గిస్తానని, ఆధార్‌కు లింక్‌ చేయనని చెప్పాడని గుర్తు చేశారు. 2014లో వంట గ్యాస్‌ ధర రూ. 400 ఉంటే ఈ రోజు రూ. 850 పెరిగింది. రూ.450 ధర పెరిగినప్పుడు సబ్సిడీ ద్వారా రూ. 100 ఇస్తున్నారా అని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాల మాఫీ అని మహిళలను మోసం చేసిన చంద్రబాబు.. వంట గ్యాస్‌ ధర విషయంలో కూడా వంచన చేశాడని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో వంట గ్యాస్‌ ధర రూ. 50 కేంద్రం పెంచితే సబ్సిడీ రూ. 50 ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన మహనీయుడు వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. 
రూ. 100 సబ్సిడీ హామీ అమలు చేయలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి. చంద్రబాబు నోటిని కడిగేందుకు ఫినాయిల్‌ కూడా సరిపోద్దు కొత్త రకం మందును కనిపెట్టాలన్నారు. 

ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నింధలు వేయడంతో టీడీపీ నీచ బుద్ధి రోజు రోజుకు బయటపడుతుందని సుధాకర్‌బాబు అన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య వైయస్‌ జగన్‌పై నోరు జారుతున్నారని, ఓటుకు కోట్ల విషయంలో ఎవరితో..? ఎక్కడ..? రాజీ పడ్డారని, ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై ఎందుకు కేసు నమోదు కాలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌ అయిందా.. అయితే రేవంత్‌రెడ్డి పాత్ర, చంద్రబాబు పాత్ర ఏంటీ.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వడానికి తెచ్చిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు.. అది నల్ల డబ్బా.. తెల్ల డబ్బా.. దీనికి సమాధానం చెప్పాలన్నారు.  బీజేపీ, కేసీఆర్, చంద్రబాబు మధ్య జరిగిన ఒప్పందాలు ఏంటీ.. ఎందుకు ఓట్లు కోట్ల కేసులో బాబును అరెస్టు చేయలేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో ఎవరూ చంద్రబాబును కాపాడలేరన్న కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఓటుకు కోట్ల విషయంలో ప్రశ్నించిన ప్రతీ సారి మాపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగడం, లేని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్ని చేసినా చంద్రబాబు అరాచకాలు, అవినీతి, దోపిడీని ప్రజల మధ్యలో ఎండగడుతూనే ఉంటామన్నారు. వైయస్‌ఆర్‌ రాజకీయ వారసులం.. ఆయన పోరాట పటిమ, ప్రజల పట్ల ఉన్న ప్రేమ అనువనువు ఇమిడించుకున్నామన్నారు. అధికార దాహంతో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ చేసే ద ఓపిడీ అడ్డుకొని తీరుతామన్నారు. దొంగచాటుగా ఇంధన ధరలపై వసూలు చేస్తున్న 4 శాతం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, చంద్రబాబును బజారుకు ఈడ్చి ప్రజల మధ్యలో నిలబెడతామని హెచ్చరించారు. 
Back to Top