దొంగల ముఠాకు చంద్రబాబు నాయకుడు

– కుల, మత, వర్గ తేడాలు లేకుండా జీవించాలని అంబేద్కర్‌ ఆకాంక్ష
– దేశంతో ప్రతి 15 నిమిషాలకు ఒక దళితుడిపై దాడి
– చంద్రబాబు తన అవినీతి సొమ్ముతో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల కొనుగోలు
– రాజ్యాంగ పరిరక్షణ కోసం అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు
విజయవాడ: రాష్ట్రంలో దొంగల పాలన సాగుతుందని, దొంగల ముఠాకు చంద్రబాబు నాయకుడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు విమర్శించారు. దళితులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తున్నామని, అందుకే ఇవాళ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. కుల, మత, వర్గ తేడాలు లేకుండా జీవించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆకాంక్షించారని, ఆ ఆకాంక్షను పాలకులు తుంగలో తొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు దొంగలించారన్నారు. ఇసుక , మట్టి, నేల ద్వారా సంపాదించిన అక్రమ సంపాదనతో మా ఎమ్మెల్యేలను దొంగలించిన చంద్రబాబు దొంగల ముఠా నాయకుడు అన్నారు. ఈ పరిపాలనను  బంగాళఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. దళితులు, అణగారిన వర్గాలను తక్కువ స్థాయిలో చూసిన ఈ ప్రభుత్వాన్ని మేం వ్యతిరేకిస్తున్నామన్నారు. దళితులుగా పుట్టాలని సీఎం పీఠంపై ఉన్న వ్యక్తి అంటే మాకు తీవ్ర ఆవేదనగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలను సమానంగా చూస్తానని, బంధుప్రీతి చూడనని ప్రమాణం చేసిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అందుకే అంబేడ్కర్‌ మహాశయుడికి చంద్రబాబు మనస్సు మార్చాలని, మంచి బుద్ధి ప్రసాదించాలని ఆయన విగ్రహాలకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. దళితులు, బీసీలపై దాడులు ఆపాలని ప్రార్థించామన్నారు. రాష్ట్రంలో దొంగల పాలన సాగుతుందని, ఎటు చూసిన దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రతి 15 నిమిషాలకు దళితులపై దాడులు జరుగుతున్నాయని, దేశంలో నరేంద్ర మోడీ పాలన దురదృష్టకరమన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top