దద్దమ్మలమని ఒప్పుకొని దిగిపోండి

తక్కువ వడ్డీకి అప్పు తెచ్చే సత్తా వైయస్‌ జగన్‌కు ఉంది
దేశంలో ఎక్కడా లేని విధంగా బాండ్ల పేరుతో చంద్రబాబు కొత్త దోపిడీ 
నాలుగున్నరేళ్లుగా దోచుకున్న సొమ్మును ఇన్‌వెస్టర్ల రూపంలో అందజేత 
13.32 శాతం వడ్డీతో చంద్రబాబు అప్పుల అప్పారావుగా మిగిలిపోతాడు
నాలుగేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు రాజధాని నిర్మాణమంటూ డ్రామాలు
రూ. 50 కోట్లకు టెండర్లు పిలిచి 15 శాతం అడ్వాన్స్‌లు చెల్లింపులు
దాంట్లో చంద్రబాబు వాటా పది శాతం
పాలన చివరి రోజుల్లో అందినకాడికి దోచుకోవడమే బాబు సిద్ధాంతం
విజయవాడ: నాలున్నరేళ్లుగా దోచుకున్న సొమ్మును దొడ్డిదారిన ఇన్‌వెస్టర్ల రూపంలో అందించి దీర్ఘకాలం వడ్డీరూపంలో పొందడానికి చంద్రబాబు కుట్రపన్నుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని బాధ్యతగా పరిపాల్సింది పోయి ఆర్థిక వనరుగా తన వ్యక్తిగత ఆస్తులను, కుటుంబ ఆస్తులను, పార్టీ ఆస్తులను పెంచుకోవడానికి, తన వర్గం వారు విచ్చలవిడిగా దోచుకునేలా నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు పాలన కొనసాగిందన్నారు. విభజన చట్టంలోని అంశాలను సాధించుకోలేని చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టం 13వ షెడ్యుల్‌లో రాజధానికి కావాల్సిన అర్థిక వనరులు ఏర్పాటు చేస్తాం అని స్పష్టంగా ఉన్నా.. కేంద్రం ఆధ్వర్యంలో రాజధాని నిర్మానం జరిగితే ముడుపులు రావని వేలకోట్లు దోచుకోవడానిక కుట్ర పన్నారని మండిపడ్డారు. 

ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఆంధ్రరాష్ట్రాన్ని బాండ్ల పేరుతో ఊబిలోకి దించుతున్నాడని, చంద్రబాబు అప్పుల అప్పారావుగా మిగిలిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. రాజధాని పేరుతో రూ. 2 వేల కోట్ల బ్యాండ్లు ప్రభుత్వం ఏ విధంగా జారీ చేసిందో ప్రజలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్‌ తరువాత వచ్చిన సొమ్మును బ్యాంకుల్లో పెడితే కనీసం వడ్డీ ఇచ్చే పరిస్థితి లేదు కానీ ప్రభుత్వం మనకు పోయేది ఏముందన్నట్లుగా రూ. 13.32 వడ్డీకి రూ. వేల కోట్లు సేకరించిందన్నారు. అది కూడా తొమ్మిది ఇన్‌వెస్టర్ల నుంచి గంటలో సేకరించిందంటే ఇదంతా చంద్బరాబు దోచుకున్న సొమ్మేనని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిన్న చిన్న మధుపరులు, రిటైర్డ్‌ ఎంప్లయీస్‌ వేల మంది ఉన్నారని వారి నుంచి రూ. 10.32 శాతానికి డబ్బులు తీసుకుంటే మేలు జరిగేది కాదా అని ప్రశ్నించారు. బాండ్లను సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తీసుకువస్తే పేదలు కూడా మేలు పొందుతారనే ఇంకింతజ్ఞానం లేకపోతే ఎలా అని విరుచుకుపడ్డారు. నిధులు సమకూర్చేందుకు బ్రోకర్లను పెట్టుకొని వారికి రూ. 17 కోట్లు అప్పనంగా చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

10.32 శాతం కంటే తక్కవ ప్రతిపక్షం ఇప్పించగలదా అని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని పార్థసారధి అన్నారు. చంద్రబాబు, టీడీపీ మంత్రులకు సిగ్గుంటే.. చేతగాని దద్దమ్మలనే నిర్ణయానికి వస్తే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దిగిపోతే 13.32 కంటే తక్కువకు వనరులు సేకరించే దమ్ము వైయస్‌ జగన్‌కు ఉందన్నారు. 10.32 శాతం కంటే తక్కువ వడ్డీకి ఆర్థిక వనరులు లభించవని ప్రభుత్వం నమ్మితే ఏ విధంగా 65 జీఓ విడుదల చేసిందని ప్రశ్నించారు. జీఓ విడుదలలో అధికారుల పాత్ర ఉంటుందా..? లేక లోకేష్‌.. ఆయన తాబేదారుల పాత్ర ఉంటుందా అని నిలదీశారు. తక్కువ వడ్డీకి వస్తే ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని, కేంద్రానికి చెందిన ఆర్థిక సంస్థ హడ్కోను సంప్రదించండి అని, ఒకవేళ 8 శాతాని కంటే హడ్కో నుంచి సాధించలేకపోతే షెడ్యూల్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ నుంచి 6 శాతం వడ్డీతో తీసుకువస్తామని జీఓ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రం ట్యాక్స్‌ ఫ్రీ బాండ్లకు పర్మిషన్‌ ఇవ్వలేదంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని స్పష్టంగా అర్థమైందన్నారు. 

ప్రజలు చంద్రబాబును క్షమించే పరిస్థితిలో లేరు కాబట్టి పాలన చివరి కాలంలో అందనకాడికి దోచుకోవడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. నాలుగేళ్లు నిద్రపోయి రాజధానికి రూ. 5 వేల కోట్లు కూడా ఖర్చు చేసి శాశ్వత భవనం నిర్మించలేని ప్రభుత్వం ఎన్నికలు త్వరపడుతున్నాయని ఆఖరి సంవత్సరంలో దాదాపు రూ. 50 వేల కోట్ల టెండర్లు పిలుస్తుందన్నారు. నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా టెండర్లు పిలిచి గతంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టర్‌లకు 15శాతం అడ్వాన్స్‌లు చెల్లించి వారి నుంచి 10 శాతం ముడుపులు తీసుకొని సర్ధుకుంటున్నారన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి రాజధాని రూ. 60 వేల కోట్లతో నిర్మించాలని ఉంటే నాలుగేళ్లు ఎందుకు మౌనంగా కూర్చుందో చెప్పాలన్నారు.  రూ. 60 వేల కోట్లలో రూ. 6 వేల కోట్లు జేబుల్లో వేసుకోవడానికి చంద్రబాబు కుట్ర అన్నారు. బాండ్ల రూపంలో తీసుకున్న అప్పు రూ. 2 వేల కోట్లు ఏ విధంగా తిరిగి చెల్లిస్తారంటే సీఆర్‌డీఏ ఆదాయం గొప్పగా వస్తుంది.. లేఅవుట్లు, నిర్మాణాలు జరిగితే సెస్‌ ద్వారా లేదా పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది చెల్లిస్తామంటున్నారు. సీఆర్‌డీఏ ఆదాయాలు సమకూర్చే సంస్థ అయితే ఎందుకు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందో చెప్పాలన్నారు. 
 
నాలుగేళ్లలో చంద్రబాబు కట్టిన భవనాలు ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయన్నారు. గత వర్షాకాలంలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ఛాంబర్‌లో నీరు లీకేజీ అవుతుంటే వైయస్‌ఆర్‌ సీపీ వాళ్లే పైన పైపులు కట్‌ చేసుకున్నారని టీడీపీ మంత్రులు సిగ్గులేకుండా ప్రచారం చేశారని, ఇప్పుడు మంత్రుల క్యాబిన్స్‌ల్లో నీరు చేరుతున్నాయి. అంటే మంత్రులు కట్‌ చేసినట్లేనా..? అని ధ్వజమెత్తారు. తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షాలకే లీకేజీ అవుతుందన్నారు.
 
Back to Top