– శాంతిభద్రతలు కాపాడటంతో చంద్రబాబు విఫలం– దళితులను అడ్డంపెట్టుకుని కేసులు పెడుతున్నారు– ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు– వైయస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే ముద్దాయి– చంద్రబాబుకు హత్యారాజకీయాలు అలవాటే– చంద్రబాబు మొదటి నుంచి దళిత వ్యతిరేకి– అప్పులు తెచ్చి మరీ దోచుకుంటున్నారువిజయవాడ: రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచుకుంటున్నారని, దోచుకున్న లక్ష కోట్లకు లెక్కలు చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండు చేశారు. దళితుల సంక్షేమం గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యారని, ప్రజాధనంతో ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాల్లో తిరుగుతూ పాలనను పక్కన పెట్టారని విమర్శించారు. అప్పులు తెచ్చి మరి దోచుకోవడం బాధాకరమన్నారు. దళిత నాయకులతో కేసులు వేయించి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు..ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ఆ అనుభవం ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలన విడిచి పెట్టి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్లి వచ్చి రాని భాషాతో అదరగొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడలేని ముఖ్యమంత్రి, స్వయాన ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే దానిపై చర్యలు తీసుకోలేని నీవా దేశం గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు మాట్లాడుతూ..మా నాయకుడిపై అమ్మ విజయమ్మ, చెల్లెలు షర్మిళమ్మ హత్యాయత్నం చేయించారని ఆరోపించారని, అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా, మా నేత జోగి రమేష్‌పై కేసులు పెట్టించారని మండిపడ్డారు. దాడికి గురైన మా నాయకుడిపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో మేధావులను తయారు చేసింది తానే అనే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు..దళితులను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. నీ పరిస్థితి ఏంటో దళిత నాయకుడు మోత్కుపల్లి నరసింహులు చెప్పారని గుర్తు చేశారు. తనను అనేక రకాలుగా హింసించారని నరసింహులు తిరుమలలో కన్నీరు పెట్టుకున్నారని చెప్పారు.
జగన్‌పై హత్యకు చంద్రబాబు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా చంద్రబాబే అన్నారు. దళిత హక్కులను తాకట్టుపెట్టే విధంగా చంద్రబాబు వాడుకుంటున్నారన్నారు. అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్నారు. దళితులతో కేసులు వేయించి అక్రమ కేసులు వేయిస్తావా అని ప్రశ్నించారు. హత్యాయత్నం కేసులో చంద్రబు దోషిగా తేలబోతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎన్ని కోట్లు దళితులకు కేటాయించిన డబ్బులు దిగమింగావో సమాధానం చెప్పాలన్నారు. అప్పులు తెచ్చి మరీ దోచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు తన బోగాలకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసే అవినీతి, అక్రమాలను ఎల్లో మీడియా కప్పి పెట్టిందన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఉన్న రథచక్రాలు రెండు ఊడిపోయాయన్నారు. చంద్రబాబుది హత్యారాజకీయాలని విమర్శించారు. మా నాయకుడు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే ఈ రోజుకు కూడా నోరు తెరవలేదన్నారు. ఈ రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రివి అయితే నిలబడి మరి విచారణ చేయించేవారన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో క్యాంటిన్ యజమాని హర్షవర్ధన్‌ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావని ప్రశ్నించారు.
వర్ల రామయ్య, కారేం శివాజీ, జూపూడి ప్రభాకర్..మీరు చంద్రబాబు మాయలో ఉన్నారని, మునిగిపోవడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు వల్ల మోసపోయిన అనేక మంది దళితులు ఇప్పటికే బయటకు వచ్చారన్నారు. చంద్రబాబు డూడూ బసవన్నలా మిమ్మల్ని వాడుకుంటున్నారని హెచ్చరించారు. జనాభా ప్రాతిపాదికన డబ్బులు ఖర్చు చేస్తున్నారా అని నిలదీశారు. దళితుల భూములు లాక్కుంటే ఏం చేస్తున్నారని టీడీపీ దళిత నాయకులను ప్రశ్నించారు. దళితులు, గిరిజనులు, బహుజనులకు అందాల్సిన సంక్షేమ పథకాలు పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్తుందన్నారు. రాష్ట్రం గురించి ఆలోచించకుండా దక్షిణాది రాష్ట్రాలను చంద్రబాబు బాగు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తాననన్నారు. ఇంతవరకు ఒక్క అడుగు కూడా పడలేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కనుమరుగు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత చట్టాల గురించి మాట్లాడకుండా, దళితులపై దాడి జరిగితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.