ఆనంద్‌బాబూ నోరు అదుపులో పెట్టుకో..
చంద్రబాబు ప్రాపకం కోసమే అవ్వాకులు..చవ్వాకులు..
నాలుగున్నరేళ్ల అవినీతిపై సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా..
విజయవాడః హామీలు విస్మరించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు బృందానికి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైయస్ జగన్‌కు నక్కా ఆనందబాబు రాసిన బహిరంగ లేఖలో వాస్తవం లేదన్నారు. లేఖలో అంశాలను ప్రస్తావిస్తూ ఎస్సీ సంక్షేమానికి,లోటు బడ్జెట్‌లకు సంబంధం ఏమిటంటూ ప్రశ్నించారు. ఎస్సీ బడ్జెట్‌కు, లోటు బడ్జెట్‌కు ముడివేయడం ఆనంద్‌బాబు అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పక్కనపెట్టి..బడ్జెట్‌ను అంతా టీడీపీ నేతలే మింగేశారని ఆరోపించారు. ఇసుక,మట్టి, బడ్జెట్ అంతా దోచేశారన్నారు. నాలుగున్నర ఏళ్లు టీడీపీ పాలనలో రూ.లక్ష 50వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఆ అప్పు అంతా ఎక్కడకి పోయిందో సమాధానం చెప్పాలన్నారు.
దివంగత మహానేత వైయస్‌ఆర్ హయాంలో ఒక పరిశ్రమ కూడా మూతపడలేదన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో పరిశ్రమలు అన్ని మూతపడిపోతే అవిశ్వాసం తీర్మానం పెడితే కిరణ్‌కుమార్‌రెడ్డికి మీరు దొంగలా సపోర్ట్ చేసిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో 1999–2004ల మధ్య 108 ప్రభుత్వ పరిశ్రమలను అమ్మేశారన్నారు. ఒక ఆంధ్రపదేశ్‌లో 58 పరిశ్రమలను ప్రైవేటికరణ చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే దండగని వేలాది నిరుద్యోగులను పొట్టన పెట్టకున్న చ్రరిత టీడీపీదని దుయ్యబట్టారు.. వైయస్‌ఆర్ హయాంలో కేవలం పది ఏళ్లలో 10 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. టీడీపీ పానలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రిక్రూట్‌మెంట్‌లో ఎన్ని పోస్టులు భర్తీ చేసి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు.
వైయస్‌ఆర్ హయాంలో 50 వేల డిఎస్సీ పోస్టులు, 17 వేలు పోలీసు ఉద్యోగాలు భర్తీచేశారన్నారు. టీడీపీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలుసుకుని మాట్లాడాలన్నారు. తొమ్మిదేళ్ల బాబు పాలనలో ఐటిలో కేవలం 80వేల ఉద్యోగాలు వస్తే..వైయస్‌ఆర్ హయాంలో ఒక కోటి 53లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఇది వాస్తవం కాదా...బహిరంగ చర్చకు సిద్ధంమా అంటూ ఆనంద్‌బాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో 2003–2004లో ఐటి ఎగుమతులు 5వేల కోట్లు, 2008–09 వైయస్‌ఆర్ హయాంలో 26వేల కోట్లు పెరిగింది నిజం కాదా..అని ప్రశ్నించారు. మసిపూసి మారేడుకాయ చేస్తే లెక్కలు వాస్తవం చెప్పుతాయన్నారు. ఉత్తరాలు రాసిన మాత్రాన ప్రజలు మిమ్మల్ని నమ్మరని, ప్రజలు ఇంకా మోసపోయే స్థితిలో లేరన్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తానన్ని చెప్పి మోసం చేసింది మీరుకాదా అన్నారు. వైయస్‌ఆర్ హయాంలో రాష్ట్రంలో సామాజికవర్గాల వారీగా భూ పంపిణీ జరిగిందని,. వైయస్‌ఆర్ 2004–09లో ఆరున్నర లక్షల ఎకరాలు ఎస్సీలకు భూ పంపిణీ చేశారని, నిరుపేదలై దళిత గిరిజనులకు అధికంగా భూ పంపిణీ చేశారన్నారు. అటవీ హక్కు చట్టాన్ని అమలు చేసిన ఘనత వైయస్‌ఆర్‌ది అన్నారు. టీడీపీ హయాంలో 3వందల ఎకరాలకై∙పట్టాలు పంపిణీ చేశారా అని ప్రశ్నించారు. కలబొల్లి మాటలు చెప్పడమే చంద్రబాబు నైజమని, చేతకానితనానికి నిలువుదట్టం చంద్రబాబు అని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి, హక్కు నీకు ఆనందబాబుకు లేదన్నారు. చంద్రబాబు దగ్గర ప్రాపకం అవ్వాకులు చవ్వాకులు పేలితే ప్రజలు చూస్తు ఊరుకోరన్నారు.
వైయస్‌ఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్ పేదలకు ఉపయోగపడితే టీడీపీపాలనలో ఆరోగ్యశ్రీ నాలిక గిసుకోవడానికి కూడా పనికిరావడవంలేదన్నారు. ఎస్సీలకు 48 లక్షల ఇళ్లు వైయస్‌ఆర్ హయాంలో వచ్చాయన్నారు. మీపాలనలో ఎన్ని ఇళ్లు కట్టి ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. వైయస్‌ఆర్ తన హయాంలో వోక్స్‌వ్యాగన్ మీద ఆరోపణలు వస్తే సిబిఐచే ఎంక్వైరి చేయించుకున్న ధైర్యశాలి అని అన్నారు. గత నాలుగేళ్లలో పరిశ్రమలు,ఐటికి కేటాయించాల్సిన అంశాలపై మీరు సిబిఐ ఎంక్వైయిరీ చేయించుకునే దుమ్ముందా అని సవాల్ విసిరారు.. గడచిన నాలుగేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ,విద్యుత్ చార్జీలు పెంచారని, ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో పెరిగిన ఉత్పతి ఎంత అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్ హయాంలో ఒకసారి కూడా ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు.