దళితులను మోసం చేస్తే చూస్తూ ఊరుకోం

అమరావతి: అసైన్డ్‌ భూములకు పట్టాభూమితో సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అసైన్డ్‌ భూములను మేరుగు నాగార్జున, క్రిస్టినాలు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల నుంచి అసైన్డ్‌ భూమలు సాగు చేసుకుంటుంటే.. ఎంజాయ్‌ మెంట్‌ సర్వే చేయకుండా అధికారులు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వెంటనే దళితులు సాగు చేసుకుంటున్న భూములకు సర్వే చేపట్టాలన్నారు. ప్రభుత్వం 41 జీఓను రద్దు చేయాలని కోరారు. దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఎంజాయ్‌ మెంట్‌ సర్వే చేసి దళితులకు న్యాయం చేయాలన్నారు. లేకపోతే సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 
 
Back to Top