ఉరవకొండలో వైయ‌స్‌ఆర్ సీపీ రైతు ధర్నా

ఉరవకొండ: రైతులు, చేనేత‌లు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నా రాష్ట్రం ప్ర‌భుత్వం నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, అందుకు నిర‌స‌న‌గా ఉర‌వ‌కొండ ప‌ట్ట‌ణంలో ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం రైతు ధ‌ర్నాను నిర్వ‌హిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల కన్విన‌ర్ న‌ర‌సింహులు తెలిపారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, రైతాంగ స‌మ‌స్య‌ల‌తో పాటు ప‌ట్ట‌ణంలోని పేద‌ల‌కు ఇంటి స్థ‌లాల ప‌ట్టాలు ఇవ్వాల‌న్న ప్ర‌ధాన డిమాండ్‌తో ప‌ట్ట‌ణంలోని క్లాక్ ట‌వ‌ర్ స‌ర్కిల్‌లో ధ‌ర్నా సాగుతుంద‌న్నారు. ఈ ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top