రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఏపీః  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తోంది.   సేవ్‌ డెమోక్రసీ నినాదాలతో ఆంధ్రరాష్ట్రం హోరెత్తుతోంది. వైయస్సార్సీపీ చేపట్టిన ధర్నా, నిరసన కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నాలుగు కాళ్లతో నడిపించాల్సిన ముఖ్యమంత్రే రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారంటూ వైయస్‌ఆర్‌ సీపీ మండిపడుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో  శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. అదే విధంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సేవ్‌ డెమోక్రసీ అంటూ నినదించారు. కదిరిలో పార్టీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గుంతకల్లులో పార్టీ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 


వైయస్‌ఆర్‌ జిల్లాలో..
పులివెందుల నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత వైయస్‌ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద శాంతియుత నిరసనకు దిగారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలను పాలించే అర్హత లేదని మండిపడ్డారు. రాజంపేట ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబుల ఆధ్వర్యంలో ధర్నా. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా.  చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్‌

కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా నందికోట్కూరు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారంటూ ఐజయ్య మండిపడ్డారు. ఎమిగనూరు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త ఎ్రరకోట జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గ కేంద్రంలో పార్టీ సమన్వయకర్త మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఆధోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. 

కృష్ణా జిల్లాలో...
విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. సేవ్‌ డెమోక్రసీ ర్యాలీలో పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చంద్రబాబు డౌన్‌.. డౌన్‌ అంటూ నినదించారు. అదే విధంగా తిరువూరులో ఎమ్మెల్యే రక్షణ నిధి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ సీనియర్‌ నేత సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో
పెనుగొండలో ఆచంట కన్వీనర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ పేరుతో ధర్నా చేపట్టారు. అంబేడ్కర్‌, పొట్టి శ్రీరాములు, గాంధీ, వైయస్‌ఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్టాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని మండపడ్డారు.ఫిరాయింపుదారులను ప్రోత్సహించిన చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

చిత్తూరు జిల్లాలో
తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్‌సీపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధ్యక్షుడు ప్రతాప్‌ రెడ్డి, నాయకులు మమత, రాజేంద్ర ఇమామ్‌ తదితరులు పాల్గొన్నారు. గంగాధరనెల్లూరులో ఎమ్మెల్యే నారాయణ స్మామి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కుప్పంలో ఇంఛార్జ్‌ చంద్రమౌళి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ విగ్రహం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బి.కొత్తకోటలో ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా సేవ్‌ డెమోక్రసీ నినాదాలతో హోరెత్తుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేని చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ధర్శి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అదే విధంగా కనిగిరి నియోజకవర్గంలో బు్రరా మధుసూదన్‌యాదవ్‌ ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ ధర్నా చేపట్టారు. అద్దంకి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద శాంతియుత నిరసనకు దిగారు. 

శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా ఏడురోడ్డుల జంక్షన్‌ వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వెన్నుపోటు చంద్రబాబు సీఎంగా పనికిరాడంటూ నినాదాలు చేశారు. అదే విధంగా ఆముదాలవలస తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అదే విధంగా నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ సీనియర్‌ నేత ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సేవ్‌ డెమోక్రసీ ధర్నా నిర్వహించారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టెక్కలి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త తిలక్‌ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 

నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లా గాంధీ బొమ్మసెంటర్‌లో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. వేదాయపాలెంలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద నెల్లూరు నగర డిప్యూటీ మేయర్‌ ద్వారకానాథ్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ ర్యాలీ నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్న చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. 

విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ రాస్తారోకో నిర్వహించారు. బొబ్బిలి రైల్వేస్టేషన్‌ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు బైక్‌ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. 

గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌ సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ ధర్నా నిర్వహించారు. సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నర్సరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ ధర్నా నిర్వహించారు. 


 విశాఖ‌ప‌ట్నం జిల్లాలో..
విశాఖ‌: విశాఖ‌ప‌ట్నం జిల్లాలో సేవ్ డెమోక్ర‌సీ నిర‌స‌న హోరు పెల్లుబిక్కింది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల వ‌ద్ద భారీ బైక్ ర్యాలీలు నిర్వ‌హించి త‌హ‌శీల్దార్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా చేప‌ట్టారు. అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు సేవ్ డెమోక్ర‌సీ నిరస‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కో-ఆర్డినేట‌ర్ తిప్ప‌ల నాగిరెడ్డి ఆధ్వ‌ర్యంలో త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టారు. 
పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త అదీప్‌రాజు ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీ చేప‌ట్టి నిర‌స‌న తెలిపారు. 

తూ.గో జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, సునీల్‌ ఆధ్వర్యంలో 'సేమ్‌ డెమోక్రసీ' ధర్నా. భానుగుడి జంక్షన్‌ నుంచి సర్పవరం వరకు బైక్‌ ర్యాలీ. జగ్గంపేట తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కోఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ధర్నా. వరసాల ప్రసాద్‌, గోవిందరెడ్డి, దొరబాబు, పెదబాబు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.
Back to Top