<strong>తుపాన్ నష్టపరిహారం పచ్చనేతల కైంకర్యం..</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజు..</strong>శ్రీకాకుళంః ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మహత్తర ఘట్టం నేడు పలాస నియోజకవర్గంలో అవిష్కృతం అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త డాక్టర్ అప్పలరాజు అన్నారు.జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాక కోసం ప్రజలు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారన్నారు. పలాస నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్ళాడానికి ఆతృతతో ఉన్నారన్నారు. టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.ఆఫ్‌షోర్ ప్రాజెక్టు వైయస్‌ఆర్ కల అని, 20వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరు అందించాలనే మహానేత వైయస్‌ఆర్ కల మరుగున పడిపోయిందన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి వైయస్ జగన్ ప్రజలకు కానుకగా ఇస్తారని తెలిపారు. పలాస నియోజకవర్గంలో అనేక జలాశయాలు ఉన్నాయని అన్నింటిని వైయస్ జగన్ అభివృద్ధి చేస్తారన్నారు. దీంతో గోదావరి జిల్లాలు వలే ఏడాదికి మూడు పంటలు పండించే అవకాశం కలుగుతుందన్నారు.<br/> తిత్లీ ప్రభావిత గ్రామాల ప్రజలు నష్టపరిహారం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం అర్భాటమే తప్ప సాయం అందించడం లేదన్నారు. దొరికినవాడికి దొరికినంత, లేనివాడికి లేనంత రీతిగా ఉందన్నారు. తిత్లీ తుపాను ప్రజలందరికి ఒక తుపాను అయితే, పసుపు చొక్కా వేసుకున్నవారికి పండగలా దౌర్భగ్యస్థితి నెలకొందన్నారు. వైయస్ జగన్‌తోనే ఉద్ధానం పునర్నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. రీసెర్చ్ సెంటర్‌ను పెడతామని వైయస్ జగన్ గతంలోనే చెప్పారన్నారు. నియోజకవర్గంలో మత్స్యకారులు పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, వారు వలసల మీద ఆధారపడుతున్నారన్నారు. హర్బర్‌లు నిర్మించి మత్స్యకారుల వలసలు నివారించాలని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళనున్నట్లు తెలిపారు. అలాగే గిరిజనులు అభివృద్ధికి నోచుకోకుండా కనీస సౌకర్యాలకు సైతం దూరంగా ఉన్నారని వారి పురోగతికి కార్యాచరణ చేసి ఇండస్ట్రీయల్ హబ్ కేటాయించాలని కోరారు.