వెల్‌లోకి దూసుకెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు


ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఇవాళ రాజ్యసభలో విభజన హామీలు, ప్రత్యేక హోదాపై చర్చకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పట్టుబట్టారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ మాత్రం తన సీట్లోనే కూర్చున్నారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరపాలని ఉదయం ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు అందజేశారు. మరోవైపు ఈ నెల 24న ఏపీ బంద్‌కు వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ను విజయవంతం చేయాలని భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 
 
Back to Top