అవిశ్వాస తీర్మానానికి జాతీయ‌, ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు


- వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ చూసి టీడీపీలో క‌ల‌వ‌రం
-  బీజేపీ ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతోనే చంద్ర‌బాబు త‌ప్పుకున్నారు
ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానానికి జాతీయ‌, ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు ఉంద‌ని ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. సోమ‌వారం పార్ల‌మెంట్లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి టీడీపీలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌న్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల బీజేపీ ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో చంద్ర‌బాబు ఎన్‌డీఏ నుంచి త‌ప్పుకున్నార‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌నే త‌మ ధ్యేయ‌మ‌ని అందుకోసం ఎంత‌టి త్యాగానికైనా సిద్ధ‌మే అన్నారు. ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ..ప్ర‌త్యేక మోదా ఇవ్వాల‌నుకుంటే ప్ర‌ధాని మోడీకి ఐదు నిమిషాల స‌మ‌యం చాలు అన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ..ప్ర‌త్యేకహోదాపై బాబు పూట‌కో మాట మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రు అవిశ్వాస తీర్మానం పెట్టిన మ‌ద్ద‌తిస్తామ‌న్నారు. 
Back to Top